VIRAL: మహాకుంభమేళాలో ఈ బాబా స్పెషల్
ఉత్తర్‌ప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతోన్న మహాకుంభమేళా నిర్విఘ్నమానంగా జరుగుతోంది. ఈ క్రమంలో అక్కడకు వచ్చిన వారిలో రోజుకో బాబా సోషల్ మీడియాలో వైరలవుతున్నారు. తాజాగా ఏడు అడుగులున్న రష్యాకు చెందిన ‘ఆత్మ ప్రేమ్ గిరి మహారాజ్ బాబా’ గురించి చర్చ జరుగుతోంది. ఈ కండలు తిరిగిన సాధువు తన జీవితాన్ని హిందూమత ప్రచారానికి అంకితం చేశారు. ఆయన 30 ఏళ్ల క్రితం టీచర్ ఉద్యోగాన్ని వదిలి సనాతన హైందవ ధర్మాన్ని స్వీకరించారు.