‘డిప్యూటీ సీఎం’ పదవిపై రచ్చ.. టీడీపీకి జనసేన స్ట్రాంగ్ కౌంటర్!

50చూసినవారు
‘డిప్యూటీ సీఎం’ పదవిపై రచ్చ.. టీడీపీకి జనసేన స్ట్రాంగ్ కౌంటర్!
AP: నారా లోకేష్‌‌ను డిప్యూటీ సీఎం చేయాలంటూ టీడీపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తున్నాయి. ఈ నేపథ్యంలో పలువురు జనసేన నేతలు ఈ వ్యాఖ్యలపై తీవ్రంగా మండిపడుతున్నారు. ఇదే జరిగితే పవన్ ను సీఎంగా, లోకేష్‌‌ను డిప్యూటీ సీఎంగా చేయాలని కౌంటర్ స్టేట్మెంట్లు ఇస్తున్నారు. మరికొందరు జనసేన నేతలు చివరి రెండున్నరేళ్లు పవన్‌కు సీఎం పదవి ఇవ్వాలనే డిమాండ్ కూడా తీసుకువస్తున్నారు. దీంతో ఈ అంశం కూటమిలో కుంపట్లకు దారి తీస్తుందా అనే చర్చ జోరుగా జరుగుతొంది.

సంబంధిత పోస్ట్