కేవలం NDRF బలగాలే కాకుండా, ప్రతీ ఒక్కరూ విపత్తులను ఎదుర్కునేలా అవగాహన కల్పించే దిశగా ఏపీ ప్రభుత్వం పనిచేస్తుందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. విజయవాడ సమీపంలోని కొండపావులూరులో పవన్ మాట్లాడుతూ.. "విపత్తులు కేవలం ప్రకృతి సంబంధమైనవి మాత్రమే కాదు.. మానవులు చేసినవి కూడా ఉంటాయి. 2024 ఎన్నికల్లో గత ప్రభుత్వం తిరిగి అధికారంలోకి వచ్చి ఉంటే రాష్ట్రంలో ఏ స్థాయి విపత్తు ఉండేదో ఊహించాలి. ప్రజలను గత ప్రభుత్వ విపత్తు నుంచి కాపాడగలిగాము." అని అన్నారు.