ఇక నుంచి రాష్ట్రానికి మంచి రోజులు రానున్నాయి: పవన్ కళ్యాణ్

50చూసినవారు
ఇక నుంచి రాష్ట్రానికి మంచి రోజులు రానున్నాయి: పవన్ కళ్యాణ్
ఇక నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మంచి రోజులు రానున్నాయని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. ఆదివారం విజయవాడ సమీపంలోని కొండపావులూరులో పవన్ మాట్లాడుతూ.."గత ఆరు నెలలుగా రాష్ట్రంలో ఎన్డీయే ప్రభుత్వం కొలువు తీరిన నాటి నుంచి కేంద్రం అందిస్తున్న సహకారం అమోఘం. విశాఖ స్టీల్ ప్లాంట్ కి ప్రత్యేకంగా నిధులు కేటాయించినందుకు ధన్యవాదాలు. ఇది రాష్ట్రానికి ఓ అభివృద్ధి సూచిక అని భావిస్తున్నాం. ఇక నుంచి రాష్ట్రానికి మంచి ప్రభుత్వంలో మంచి రోజులు రానున్నాయి." అన్నారు.

సంబంధిత పోస్ట్