దివ్యాంగ ప్రయాణికుడిపై పోలీస్ దాడి (వీడియో)
తమిళనాడులోని నిడమంగళంలో అమానవీయ ఘటన జరిగింది. మన్నై ఎక్స్‌ప్రెస్ దివ్యాంగుల కోచ్‌లోకి ఓ వ్యక్తి ప్రవేశించాడు. తనను తాను RPF కానిస్టేబుల్‌గా పేర్కొన్నాడు. రైలులోని ఓ దివ్యాంగ ప్రయాణికుడితో ఆ వ్యక్తి గొడవ పడ్డాడు. ఆవేశంలో విచక్షణారహితంగా దివ్యాంగ ప్రయాణికుడిని కొట్టాడు. తలుపు తెరవమన్నందుకు ఈ గొడవ జరిగినట్లు తెలుస్తోంది. ఇక దాడి చేసిన వ్యక్తి నిడమంగళం స్టేషన్ హెడ్ కానిస్టేబుల్ అని సమాచారం.