రేపటి నుంచి ఆకాశంలో రెండో చందమామ
రేపు భూగ్రహానికి మినీ మూన్ రాబోతుంది. ఇప్పటికే భూమిపై కనిపించే చంద్రుడు ఉన్నాడు. మరో చిట్టి చంద్రుడు కూడా రానున్నాడు. ఓ గ్రహశకలం రేపటి నుంచి నవంబర్ 25 వరకు మన భూమి చుట్టు తిరుగుతుంది. ఆ తర్వాత సూర్యుడి వైపు వెళ్తుందని పరిశోధకులు చెబుతున్నారు. ఇది నేరుగా కనిపించకపోయినా పెద్ద టెలీస్కోప్తో చూడవచ్చు. అర్జున ఆస్టరాయిడ్ బెల్డ్ నుంచి వచ్చిన ఈ గ్రహశకలం 33 అడుగులు ఉంటుంది. వీటి రాక సహజమేనని.. ఇలాంటివి అనేకం భూకక్ష్యలోకి వచ్చిపోతుంటాయని నిపుణులు అంటున్నారు.