యూపీలోని బులంద్‌షహర్‌లో సెప్టెంబర్ 26 న దారుణ ఘటన జరిగింది. కారు తాళాలు ఇవ్వలేదని 10వ తరగతి చదువుతున్న మైనర్ విద్యార్థి తన తండ్రిని కత్తితో పొడిచి చంపాడు. వెంటనే కుటుంబసభ్యులు అతన్ని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని మృతుడిని హెడ్ కానిస్టేబుల్ ప్రవీణ్‌కుమార్ గా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్ట్ చేశారు.