ప్రియురాలిని చంపేసి.. రోజంతా శవంతో ఉన్న ప్రియుడు!
కర్ణాటకలోని బెంగళూరులో సోమవారం దారుణం జరిగింది. ఆరవ్ హర్ని అనే వ్యక్తి తన ప్రియురాలైన మాయా గొగోయ్‌ని కత్తితో పొడిచి చంపేశాడు. వారిద్దరూ శనివారం ఓ అపార్ట్మెంట్లో నవ్వుతూ కనిపించారు. మూడు రోజుల తర్వాత అదే అపార్ట్మెంట్లో యువతి మృతదేహంగా కనిపించింది. అయితే, హర్ని అపార్ట్మెంట్ వదిలి వెళ్లే ముందు రోజంతా తన ప్రియురాలి మృతదేహంతో గడిపినట్లు అధికారులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.