ఉండి ఎమ్మెల్యే రఘురామ కృష్ణరాజును కస్టడీలో చిత్రహింసలు పెట్టిన కేసులో నిందితుడిగా ఉన్న సీఐడీ విశ్రాంత అదనపు ఎస్పీ ఆర్.విజయ్‌పాల్‌ను పోలీసులు అరెస్టు చేశారు. విజయ్‌పాల్ మంగళవారం ఉదయం ప్రకాశం జిల్లా ఎస్పీ దామోదర్ ఎదుట విచారణకు హాజరయ్యారు. ఒంగోలు ఎస్పీ కార్యాలయంలో ఉదయం 11 గంటల నుంచి ఆయనను విచారించిన పోలీసులు రాత్రి 7 గంటల సమయంలో అరెస్టు చేసినట్టు సమాచారం.