సింగరేణి స్థాయి 55వ రక్షణ పక్షోత్సవాలలో భాగంగా బుధవారం ఆర్జీ 2 ఏరియా వకీల్ పల్లె గనిలో రక్షణ వారోత్సవాలు నిర్వహించారు. జీఎం హెచ్ఆర్డి, పోగ్రాం కన్వీనర్ హబీబ్ హుస్సేన్, ఆర్జీ2 జీఎం వెంకటయ్య, ఆర్జి రీజియన్ రక్షణ జీఎం కేహెచ్ఆర్ గుప్తా హాజరై రక్షణ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఉద్యోగులచే రక్షణ ప్రతిజ్ఞ చేయించారు. రక్షణలో అత్యుత్తుమ ప్రతిభ కనబర్చిన ఉద్యోగులకు ముఖ్య అతిధులచే బహుమతులు ప్రధానం చేశారు.