పెద్దపల్లి జిల్లా కేంద్రంలో బస్టాండ్ వద్ద వ్యాన్, ఆటో యజమానులకు, డ్రైవర్లకు ట్రాఫిక్ సీఐ అనిల్ కుమార్ ఆధ్వర్యంలో రోడ్డు భద్రతపై అవగాహన శుక్రవారం కల్పించారు. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈనెల 1 నుండి 31వరకు జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. రామగుండం ట్రాఫిక్ ఏసీపీ నరసింహులు హాజరై రోడ్డు ప్రమాదాల నివారణపై అవగాహన కల్పించారు. మద్యం సేవించి వాహనాలు నడిపితే జరిగే అనర్థాలను వివరించారు.