తమపై ఎలాంటి కేసులు లేవని క్లియరెన్స్ నిమిత్తం కొంతమంది తప్పుడు అఫిడవిట్లు సమర్పిస్తున్నారని, అలాంటి వారిపై చట్టరీత్య కఠినచర్యలు తప్పవని రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీనివాస్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. పెద్దపల్లి, మంచిర్యాల జోన్ పరిధిలో కొంతమంది వారిపై గతంలో కేసులున్నా తమపై ఎలాంటి కేసులు లేవనే క్లియరెన్స్ కోసం తప్పుడు అఫిడవిట్లు సమర్పించారని, సుమారు 20మందిని స్పెషల్ బ్రాంచ్ గుర్తించినట్లు తెలిపారు.