పెళ్లయిన కొన్ని గంటల్లోనే నవ వధువు మృతి
AP: కాళ్లకు పారాణి ధరించి పుట్టింటి నుంచి వెళ్లిన నవ వధువు కొత్త జీవితాన్ని ప్రారంభించేలోపు విధి కాటేసింది. పెళ్లయిన కొన్ని గంటల్లోనే నవ వధువు చనిపోయిన ఘటన వైఎస్సార్ జిల్లా పెద్దముడియంలో జరిగింది. పెండ్లిమర్రి మండలానికి చెందిన సందల ఓబన్న-ఉత్తమ్మ దంపతుల రెండో కుమార్తె స్వాతి (21)కి పెద్దముడియానికి చెందిన హేమంత్‌తో వివాహం జరిపించారు. సోమవారం స్వాతి ఇంటిపని చేస్తుండగా కుప్పకూలి మృతి చెందింది. దాంతో ఆ ఇంట విషాదం చోటు చేసుకుంది.