భారత కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్)గా ఏపీకి చెందిన ఐఏఎస్ ఆఫీసర్ కొండ్రు సంజయ్ మూర్తి నియమితులయ్యారు. సంజయ్ మూర్తిని కాగ్ అధిపతిగా నియమిస్తూ రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము గెజిట్ నోటిఫికేషన్ జారీ చేశారు. ప్రస్తుతం ఆయన కేంద్ర ఉన్నత విద్యాశాఖ కార్యదర్శిగా ఉన్నారు. కాగా, కొండ్రు సంజయ్ మూర్తి తండ్రి కేఎస్ఆర్ మూర్తి అమలాపురం ఎంపీగా పని చేశారు. 1989లో హిమాచల్‌ప్రదేశ్ కేడర్‌లో ఐఏఎస్‌గా ఎంపిక అయ్యారు.