చాగంటి కోటేశ్వరరావుకు మరో బాధ్యత!
AP: ప్రముఖ ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావుకు కూటమి ప్రభుత్వం మరో కీలక బాధ్యతను అప్పగించనుంది. రాష్ట్ర నైతికత, విలువల ప్రభుత్వ సలహాదారుగా ఉన్న చాగంటి కోటేశ్వరరావుతో ప్రత్యేకంగా పుస్తకాలు తయారు చేయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. రెండ్రోజుల కిందట కేబినెట్ భేటీలో ఈ నిర్ణయం తీసుకుంది. పిల్లల్లో నైతిక విలువలు పెంపొందించేందుకు ఈ పుస్తకాలను చాగంటితో రూపొందించి పంపిణీ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.