AP: ఇవాళ మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ పుట్టిన రోజు. పలువురు రాజకీయ నేతలు జగన్‌కు ఎక్స్ వేదికగా పుట్టిన రోజు శుభాకాంక్షలు చెబుతున్నారు. తాజాగా ఏపీ సీఎం చంద్రబాబు కూడా జగన్‌కు బర్త్ డే విషెస్ చెప్పారు. ‘మీకు పుట్టిన రోజు శుభాకాంక్షలు జగన్ గారు. మీకు చక్కటి ఆరోగ్యం, సుదీర్ఘ జీవితం ఉండాలని కోరుకుంటున్నా.’ అని చంద్రబాబు ట్వీట్ చేశారు. రాజకీయ ప్రత్యర్థికి చంద్రబాబు విషెస్ చెప్పడంతో నెట్టింట వైసీపీ, కూటమి నేతల మధ్య ఆసక్తికర చర్చ జరుగుతోంది.