ఏపీలో వర్షాలు.. పొంచి ఉన్న మరో ముప్పు
AP: ఫెంగల్ తుఫాను ప్రభావంతో ఏపీలోని పలు జిల్లాల్లో వర్షాలు పడుతున్నాయి. అయితే రాష్ట్రానికి మరో ముప్పు పొంచి ఉందని వాతావరణ శాఖ తెలిపింది. నైరుతి బంగాళాఖాతంలో ఈ నెల 2వ వారంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని పేర్కొంది. ఇది బలపడి వాయుగుండంగా మారుతుందని వాతావరణ శాఖ అధికారులు చెప్పారు. వాయుగుండం తుఫానుగా మారే అవకాశం ఉందా? లేదా? అనే దానిపై వారం తర్వాత స్పష్టత రానుందని అధికారులు చెబుతున్నారు.