AP: క్రీడా భారతి వారు 4వ ఆన్‌లైన్ క్రీడా జ్ఞాన పరీక్షను 2024 డిసెంబర్ 8న నిర్వహించనుంది. ఈ పరీక్ష ఉ.5:00 నుంచి సా.5:00 గంటల వరకు ఉంటుంది. 12 ఏళ్లు పైబడిన వారు అర్హులు. ఈ పరీక్షల్లో విజయం సాధించిన వారికి ఆకర్షణీయమైన బహుమతులు అందజేస్తున్నారు. మొదటి బహుమతికి రూ.లక్ష, రెండో బహుమతికి రూ.50 వేలు, మూడో బహుమతికి రూ.25 వేలు, నాల్గవ బహుమతికి రూ.11 వేలు ఇస్తారు. https://kreedabharati.org/ వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోగలరు.