AP: అపార్ట్‌మెంట్ పై నుంచి దూకి ఓ ప్రేమ జంట బలవన్మరణానికి పాల్పడిన ఘటన విశాఖలోని గాజువాక పీఎస్ పరిధిలోని అక్కిరెడ్డి పాలెంలో చోటు చేసుకుంది. వెంకటేశ్వర కాలనీకి చెందిన సుష్మిత, దుర్గారావుకు మధ్య పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. ఇరు కుటుంబాలు తమ పెళ్లికి నిరాకరించారు. దాంతో తీవ్ర మనస్థాపానికి గురైన వారు అపార్ట్‌మెంట్ పై నుంచి దూకేశారు. ఈ దుర్ఘటనలో ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. దర్యాప్తు జరుగుతోంది.