జులానాలో వినేశ్ ఫొగాట్ విజయం
భారత మాజీ రెజ్లర్ వినేశ్ ఫొగాట్ హరియాణా అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించారు. జులానా అసెంబ్లీ నియోజకవర్గంలో కాంగ్రెస్ నుంచి ఆమె పోటీ చేశారు. రెండో స్థానంలో బీజేపీ అభ్యర్థి యోగేశ్ కుమార్, మూడో స్థానంలో ఇండియన్ నేషనల్ లోక్ దళ్ అభ్యర్థి సురేందర్ లాథర్ నిలిచారు. కాగా, హరియాణాలో బీజేపీ ఆధిక్యంలో కొనసాగుతోంది.