ఉత్తరప్రదేశ్ లక్నోలోని సోమవారం అలీగంజ్ ప్రాంతంలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ఇయర్‌ఫోన్స్ పెట్టుకుని రైల్వే ట్రాక్‌పై నడుచుకుంటూ వెళ్తున్న ఓ యువతిని రైలు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రెండు కాళ్ళు తెగిపోయి, తలకు బలమైన గాయాలు కావడంతో ఆమె మృతి చెందింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.