నదిలో పడిపోయిన బస్సు .. ఇద్దరి మృతి, 27 మందికి గాయాలు (వీడియో)

1066చూసినవారు
కేరళలోని మంగళవారం మధ్యాహ్నం ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. కోజికోడ్‌ తిరువంబాడి ప్రాంతంలో కర్టాటక ఆర్టీసీ బస్సు అదుపు తప్పి కల్వర్టును ఢీకొని కాళియంబుజ నదిలో పడిపోయింది. ఈ ప్రమాద ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా, 27 మంది తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

సంబంధిత పోస్ట్