సద్దుల బతుకమ్మ విశిష్టత ఇదే
ఆశ్వయుజ శుద్ధ అష్టమి నాడు 'సద్దుల బతుకమ్మ' లేదా 'పెద్ద బతుకమ్మ'గా గౌరమ్మను ఆరాధిస్తారు. ముందుగా రాగి పల్లెంలో ఆకులు వేసి.. దానిపై కుంకమ, పసుపు వేస్తారు. ఆ తరువాత గునుగు పువ్వును ఒక వరుసగా పేర్చి.. దానిపై బంతిపూలు, చామంతులు ఇలా అనేక రకాల రంగు రంగుల పూలతో పేరుస్తారు. అలాగే బతుకమ్మ మధ్యలో పసుపుతో తయారు చేసిన గౌరమ్మను పెడుతారు. ఇంకా అమ్మవారికి మలీద ముద్దలు, చింతపండు పులిహోర, కొబ్బరి అన్నం, నువ్వుల అన్నం, పెరుగన్నం నైవేద్యంగా సమర్పిస్తారు.