రతన్ టాటా 1970 సంవత్సరంలోనే సేవా కార్యక్రమాలను ప్రారంభించారు. ఆగాఖాన్ ఆసుపత్రి, వైద్య కళాశాలకు శ్రీకారం చుట్టారు. 1991లో ఆయన టాటా సన్స్ ఛైర్మన్‌గా బాధ్యతలు చేపట్టాక, టాటా గ్రూప్ సేవా కార్యక్రమాలు కొత్త రూపును సంతరించుకున్నాయి. టాటా ట్రస్టులను మరింతగా విస్తరించారు. టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్‌ను స్థాపించారు. విద్యా రంగానికి మరింత ప్రోత్సాహమిచ్చారు.