తొక్కిసలాట ఘటనపై న్యాయ విచారణ
AP: తిరుపతి తొక్కిసలాట ఘటనపై ప్రభుత్వం న్యాయ విచారణకు ఆదేశించింది. హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ సత్యనారాయణ మూర్తి నేతృత్వంలో ఈ విచారణ జరగనుంది. ఆరు నెలల్లో నివేదిక ఇవ్వాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ నెల 8న శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం టికెట్ల కోసం జరిగిన తొక్కిసలాటలో ఆరుగురు మరణించిన విషయం తెలిసిందే.