సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా నటించిన 'గుంటూరు కారం' సినిమాలోని 'కుర్చీ మడతపెట్టి' ఎంత ఫేమస్ అయ్యిందో చెప్పక్కర్లేదు. తాజాగా నేపాల్‌లోని వీధుల్లో ఈ సాంగ్ మారుమోగింది. కొందరు యువతులు రోడ్డుపైనే కుర్చీ మడతపెట్టి సాంగ్‌కు డాన్స్ చేయగా.. అక్కడున్నవారు అరుస్తూ, కేకలు పెట్టారు. ఒరిజినల్ సాంగ్‌లో ఉన్నట్లు అచ్చం అవే స్టెప్స్ వేసి ఔరా అనిపించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.