భారీగా పెరిగిన కూరగాయల ధరలు
తెలుగు రాష్ట్రాల్లో కూరగాయల ధరలు మరోసారి పెరిగాయి. భారీ వర్షాలకు పంటలు దెబ్బతినడంతో పాటు దిగుబడి తగ్గింది. దీంతో ధరలు పెరిగి సామాన్యులు ఇబ్బందులు పడుతున్నారు. బహిరంగ మార్కెట్లో కొత్తిమీర, పుదీనా కట్టలు రూ.60-రూ.100 పలుకుతున్నాయి. కిలో ఉల్లి రూ.60-80, పచ్చిమిర్చి 70, చిక్కుడు రూ.100, బీరకాయ రూ.80, బెండ రూ.70, క్యారెట్ రూ.100, కాకర రూ.80, టమాటా రూ.40-50 పలుకుతుండటంతో వినియోగదారులు బెంబేలెత్తుతున్నారు.