జమ్మూకాశ్మీర్‌లోని కథువా జిల్లాలోని బని ప్రాంతంలో ఎన్‌కౌంటర్ జరిగింది. ఉగ్రవాద కదలికలు ఉన్నాయన్న సమాచారంతో భద్రతాబలగాలు ఆదివారం గాలింపు చేపట్టారు. దీనిని పసిగట్టిన ఉగ్రవాదులు సాయుధ బలగాలపై కాల్పులకు తెగబడ్డారు. దీంతో భద్రతాసిబ్బంది కూడా ఎదురుకాల్పులకు దిగారు. ప్రస్తుతం ఎన్‌కౌంటర్ కొనసాగుతున్నట్లు బని పోలీసు ఉన్నతా అధికారులు వెల్లడించారు. అయితే, ఎంతమంది ఉగ్రవాదులు హతమయ్యారన్న విషయం తెలియాల్సి ఉంది.