రాష్ట్రపతి, గవర్నర్కు వైసీపీ ఫిర్యాదు
AP: తమ సోషల్ మీడియా యాక్టివిస్ట్లపై పోలీసులు అక్రమంగా కేసులు నమోదు చేశారని వైసీపీ రాష్ట్రపతి, గవర్నర్కు ఫిర్యాదు చేసింది. రాష్ట్రంలో వాక్ స్వేచ్ఛను అణచివేయడం తీవ్ర ఆందోళన కలిగించే అంశమని పేర్కొంది. కస్టడీలో కార్యకర్తలు ప్రాథమిక హక్కులను కోల్పోతున్నారని తెలిపింది. తప్పుడు కేసు పెడుతున్నారని, ఈ విషయంలో రాష్ట్రపతి, గవర్నర్ జోక్యం చేసుకోవాలని అభ్యర్థిస్తున్నట్లు వైసీపీ ఎక్స్ వేదికగా కోరింది.