25 నుంచి 108 ఉద్యోగుల సమ్మె

58చూసినవారు
25 నుంచి 108 ఉద్యోగుల సమ్మె
AP: ఈ నెల 25 నుంచి సమ్మె చేయనున్నట్లు 108 ఉద్యోగుల సంఘం వెల్లడించింది. 108 సర్వీసుల నిర్వహణ సంస్థ మారినప్పుడల్లా ఉద్యోగులు గ్రాట్యూటీ, ఎర్న్‌డ్ లీవ్ అమౌంట్, ఇయర్లీ ఇంక్రిమెంట్ల విషయంలో నష్టపోతున్నారని తెలిపింది. వీటిని చెల్లించకుండానే సంస్థలు తప్పుకుంటున్నాయని పేర్కొంది. తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని, తమ డిమాండ్లు నెరవేర్చాలని కోరింది.

సంబంధిత పోస్ట్