ఏపీ రైతులకు గుడ్ న్యూస్
ఏపీ రైతులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఖరీఫ్ సీజన్ పంటలకు ఈ-క్రాప్ నమోదు గడువును ప్రభుత్వం పొడిగించింది. ఇవాళ్టితో గడువు ముగియనుండగా.. ఈ నెల 30 వరకు గడువు పెంచింది. ఈ-క్రాప్ నమోదు చేస్తేనే పంటల బీమా అమలవుతుందని ప్రభుత్వం ఇప్పటికే క్లారిటీ ఇచ్చింది. పీఎంఎఫ్బీవై, వాతావరణ ఆధారిత పంటల బీమాను ప్రభుత్వం అమలు చేస్తోంది.