ప్రస్తుతం ఏపీ బీజేపీ చీఫ్‌గా ఉన్న పురందేశ్వరి స్థానంలో కిరణ్ కుమార్ రెడ్డికి బాధ్యతలు అప్పగించాలని కమలనాథులు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. పురందేశ్వరి పదవీకాలం త్వరలో ముగియనుండటం.. ప్రస్తుతం ఆమె ఎంపీగా ఉండటం వల్ల ప్రత్యామ్నాయంగా కిరణ్ కుమార్ రెడ్డికి అవకాశమివ్వాలని భావిస్తున్నారట. పైగా కిరణ్ కుమార్ రెడ్డి సొంత సామాజిక వర్గాన్ని ఆకట్టుకోవాలని ఇప్పటికే ప్లాన్ చేస్తున్న బీజేపీ.. కిరణ్‌కు ఇష్టం లేకపోయిన పార్టీ అధ్యక్ష బాధ్యతలు అప్పగించాలనే పట్టుదలతో ఉందట.