బెజ్జూర్ మండల కేంద్రంలో బుధవారం తొలి ఏకాదశి సందర్భంగా రంగనాయక స్వామి, శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి, శివ పార్వతులను సిర్పూర్ శాసన సభ్యులు డా. పాల్వాయి హరీష్ బాబు దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్లానింగ్ కమిటీ బోర్డు మెంబర్ కోండ్ర మనోహర్ గౌడ్, ఎంపిపి కొప్పుల శంకర్, జాడి దిగంబర్, భాస్కర్ రాజు, సామెర తిరుపతి, శ్రీనివాస్, మహేష్, బెనికి శ్యామ్ సుందర్, తదితరులు పాల్గొన్నారు.