మంత్రి కొండా సురేఖపై అమల ఫైర్.
తెలంగాణ మంత్రి కొండా సురేఖ తన కుటుంబంపై చేసిన వ్యాఖ్యలపై అక్కినేని అమల స్పందించారు. సురేఖ వ్యాఖ్యలు విని షాక్ అయ్యానన్నారు. మంత్రిగా ఉండి ఆమె అలా మాట్లాడటం దారుణమన్నారు. తన భర్తపై నిరాధార ఆరోపణలు చేయడం సిగ్గుచేటని పేర్కొన్నారు.
తన కుటుంబాన్ని రాజకీయ వివాదాల్లోకి లాగవద్దని అమల అన్నారు. సురేఖ తన వ్యాఖ్యలు వెనక్కి తీసుకుని క్షమాపణలు చెప్పేలా రాహుల్ గాంధీ చొరవ తీసుకోవాలని సోషల్ మీడియా వేదికగా పోస్టు చేశారు.