ప్రశాంత్ కిశోర్ ఆమరణ నిరాహారదీక్ష!
జన్ సురాజ్ పార్టీ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిశోర్ గాంధీ మైదానంలో ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. ఇటీవల BPSC నిర్వహించిన ప్రిలిమినరీ పరీక్షల్లో అవకతవకలు జరిగినట్లు ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఆ పరీక్షలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఆయన మాట్లాడుతూ ప్రిలిమినరీ పరీక్షను రద్దు చేసి.. మళ్లీ కొత్తగా నిర్వహించాలని డిమాండ్ చేశారు. 48 గంటల్లోగా బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలని, లేదంటే దీక్షకు దిగుతానని అన్నారు.