నేవీ డే రిహార్సల్స్‌లో కమాండోలకు తప్పిన ప్రమాదం (వీడియో)

84చూసినవారు
భారత నౌకాదళం ఆధ్వర్యంలో ఒడిశాలోని పూరీ తీరంలో డిసెంబర్ 4న ‘నేవీ డే’ నిర్వహించనున్నారు. దీనిలో భాగంగా గురువారం నేవీ డే రిహార్సల్స్‌లో పాల్గొన్న కమాండోలకు పెద్ద ప్రమాదం తప్పింది. కిందికి దిగుతుండగా కమాండోల పారాషూట్లు ఢీకొన్నాయి. పారాషూట్లు ఢీకొనడంతో సముద్రంలో కమాండోలు పడిపోయారు. వెంటనే అప్రమత్తమై నేవీ సిబ్బంది ఆ కమాండోలను రక్షించారు.

సంబంధిత పోస్ట్