వనమహోత్సవ కార్యక్రమంలో సింగరేణి సీఎండీ
వన మహోత్సవంలో భాగంగా ‘ప్రతీ అడుగు పచ్చదనం’ అనే నినాదంతో సింగరేణిలో చేపట్టిన కార్యక్రమంలో భాగంగా ఇల్లెందు గెస్ట్‌హౌస్ ప్రాంగణంలో శనివారం సింగరేణి సంస్థ సీఎండీ ఎన్.బలరాంనాయక్ 235 మొక్కలు నాటారు. ఈ సందర్భంగా సీఎండీ మాట్లాడుతూ.. పర్యావరణ పరిరక్షణపై తమ సంస్థ మొదటి నుంచీ ప్రత్యేక శ్రద్ధ చూపిస్తోందని, మొక్కలు నాటుతూ అడవులను పెంచుతోందని అన్నారు.