ఇల్లందు నియోజకవర్గంలోని టేకులపల్లి మండలం టేకులపల్లికి చెందిన బీద విద్యార్థులు సాయి మేఘన, సాయి భావనలకు సోమవారం కాంగ్రెస్ నియోజకవర్గ నాయకులు డాక్టర్ భూక్యా రాంచంద్ర నాయక్ 5, 10వ తరగతి స్టడీ మెటీరియల్ ను అందజేశారు. ఈకార్యక్రమంలో నాయకులు ఇస్లావత్ రెడ్యా నాయక్, సదానందం, బాబురావు తదితరులు పాల్గొన్నారు.