
ఇల్లందు: ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే
ఇల్లందు మండలం రేపల్లెవాడ గ్రామపంచాయతీలో గురువారం ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే కోరం కనకయ్య ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతులకు ఎన్నికల సందర్భంలో ఇచ్చిన హామీ మేరకు సన్న ధాన్యానికి రూ. 500 బోనస్ ఇస్తున్నామని, దొడ్డు ధాన్యానికి రూ. 2320 ఇస్తున్నట్లు తెలిపారు. రైతులు దళారుల చేతుల్లో మోసపోకుండా ప్రభుత్వం నిర్వహించే కొనుగోలు కేంద్రాల్లో అమ్ముకోవాలన్నారు.