ప్రైవేటు ట్రావెల్స్ బస్సులు పండగపూట అధిక రేట్లకు టికెట్లు విక్రయిస్తుండటంతో ఆర్టీఏ విజిలెన్స్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. విజయవాడ హైవేలో మూడు రోజులుగా తనిఖీలు చేపట్టి.. నిబంధనలు పాటించని వాహనాలకు చలానాలు విధించి కేసు నమోదు చేశారు. ఇప్పటికే 360 కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. అధిక ఛార్జీలు వసూలు చేస్తున్నట్లు ఫిర్యాదు అందితే సదరు ట్రావెల్స్ యజమానులపై కేసులు నమోదు చేస్తామని వెల్లడించారు.