ప్రేమోన్మాది చేతిలో యువతి దారుణ హత్య
ఏపీలోని కర్నూలు జిల్లా ఆస్పరి మండలం నగరూరు గ్రామానికి చెందిన అశ్విని అనే ఇంటర్ విద్యార్థిని ప్రేమోన్మాది చేతిలో బలైంది. దసరా సెలవులకు అశ్విని ఇంటికి వచ్చింది. అదే గ్రామానికి చెందిన సన్నీ ఎవరూ లేని సమయంలో ఆమె ఇంటికి వెళ్లాడు. తనను ప్రేమించాలని బెదిరించాడు. యువతి నిరాకరించడంతో పురుగుల మందు ఆమె నోట్లో పోసి పారిపోయాడు. తల్లిదండ్రులు వచ్చి చూడగా.. అశ్విని చావుబతుకుల్లో కనిపించింది. ఆస్పత్రికి తరలిస్తుండగా అశ్విని ప్రాణాలు విడిచింది.