ఏపీకి మరో వాయుగుండం ముప్పు పొంచి ఉంది. బంగాళాఖాతంలో ఈ నెల 22 నాటికి మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఇది 24 నాటికి వాయుగుండంగా బలపడుతుందని వాతావరణ శాఖ అంచనా వేసింది. దీని ప్రభావంతో రాష్ట్రంలోని ఉత్తర కోస్తాలో భారీ వర్షాలు పడతాయని వెల్లడించింది. కాగా.. శని, ఆదివారాల్లో రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.