‘చాగంటి నియామకం సరికాదు’
AP: ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావును విద్యార్థులకు నైతిక విలువలనే నేర్పించేందుకు ప్రభుత్వ సలహాదారుగా నియమించడం సరికాదని, ఈ విషయంలో ప్రభుత్వం పునరాలోచన చేయాలని సీఎం చంద్రబాబుకు విద్యావేత్తలు, కవులు, రచయితలు, ప్రజాసంఘాల ప్రతినిధులు బహిరంగ లేఖ రాశారు. చాగంటి నియామకాన్ని వ్యతిరేకిస్తూ జనవిజ్ఞాన వేదిక రాష్ట్ర అధ్యక్షుడు గేయానంద్ అధ్యక్షతన వర్చువల్గా సభ నిర్వహించారు. 72 మంది ప్రముఖులు చాగంటి నియామకాన్ని వ్యతిరేకించారు.