TG: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. బుధవారం తెలంగాణ భవన్ నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. పొంగులేటి మాట్లాడితే వాళ్ళు వీళ్ళు జైలుకి పోతారని అనడం కాదు, ముందు నువ్వు ఎప్పుడు జైలుకి పోతావో చూస్కో అని దుయ్యబట్టారు. అందరినీ జైలుకు పంపుతానని అన్న మీరు.. అందరికంటే ముందుగా జైలుకు పోయేలా ఉన్నారని ఎద్దేవా చేశారు.