హైదరాబాద్ రాజేంద్రనగర్‌లో మరోసారి చిరుత కలకలం సృష్టించింది. రాజేంద్రనగర్‌లోని వ్యవసాయ విశ్వవిద్యాలయానికి మార్నింగ్ వాక్‌కు వెళ్లిన పలువురికి చిరుత కనిపించింది. దీంతో వారు భయబ్రాంతులకు గురయ్యారు. చిరుత ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహం వద్దకు వచ్చి.. అక్కడి నుంచి చెట్లలోకి వెళ్లిపోయినట్లు తెలిపారు. మార్నింగ్ వాకర్స్ చిరుత పాద ముద్రలు సైతం గుర్తించారు. ఈ ఘటన తెలియడంతో విద్యార్థులు భయాందోళన చెందుతున్నారు.