ముంబై వీధుల్లో దర్జాగా తిరుగుతున్న చిరుత పులి (వీడియో)

69చూసినవారు
అరణ్యంలో ఉండాల్సిన చిరుత పులి ముంబై వీధుల్లో సరదాగా తిరుగుతూ కనిపించింది. దీనికి సంబంధించిన వీడియో తాజాగా నెట్టింట వైరల్ అవుతోంది. శుక్రవారం అర్ధరాత్రి ఆరే కాలనీలోని యూనిట్ 5లో రహదారిపై ఓ చిరుత నడుస్తూ కనిపించింది. ఒక వాహనదారుడు దీనిని తన కెమెరాలో బంధించాడు. ఆపై అటవీ అధికారులకు సమాచారం అందించాడు. పోలీసులు చిరుతకోసం గాలింపు చర్యలు చేపట్టారు.

సంబంధిత పోస్ట్