ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. షహదారా జిల్లాలోని సీమాపురి పోలీస్ స్టేషన్ మొదటి అంతస్తులో ఆదివారం అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది.. ఘటనా స్థలానికి చేరుకొని ఏడు అగ్నిమాపక వాహనాలతో మంటలను అదుపులోకి తెచ్చారు. అయితే ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని డీసీపీ ప్రశాంత్ గౌతమ్ వెల్లడించారు. అయితే ప్రమాదం జరగడానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.