కేంద్ర మంత్రి కుమార స్వామిపై కేసు నమోదు
కర్ణాటక మాజీ సీఎం, కేంద్ర మంత్రి, జేడీఎస్ నేత హెచ్డీ కుమార స్వామిపై ఎఫ్ఐఆర్ నమోదైంది. ఏడీజీపీ ఎం.చంద్రశేఖర్ ఫిర్యాదు మేరకు సంజయ్ నగర్ పోలీసులు కుమారస్వామి, ఆయన కుమారుడు నిఖిల్‌పై కేసు నమోదు చేశారు. మైనింగ్ కేసును విచారిస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందానికి తాను నేతృత్వం వహిస్తున్నట్లు చంద్రశేఖర్ తెలిపారు. మైనింగ్ కేసులో విధులు నిర్వర్తించకుండా అడ్డుకునేందుకు తనను కుమార స్వామి, ఆయన కుమారుడు నిఖిల్ బెదిరించారని ఫిర్యాదులో పేర్కొన్నారు.