డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి కొన్నాళ్ల క్రితం రమ్య అనే ఒక డాక్టర్‌ని పెళ్లి చేసుకొని మనస్పర్థల కారణంగా విడాకులు తీసుకున్నారు. అయితే తాజా సమాచారం ప్రకారం క్రిష్ రెండో పెళ్లి చేసుకోబోతున్నారు. త్వరలో ఎంగేజ్‌మెంట్ కూడా కానుంది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈసారి కూడా ఆయన ఒక డాక్టర్‌ను వివాహం చేసుకోబోతున్నారు. అయితే ఆ డాక్టర్ కూడా విడాకులు తీసుకున్నారని, ఆమెకి 11 ఏళ్ల కుమారుడు కూడా ఉన్నట్టుగా తెలుస్తోంది.