AP: చిత్తూరు జిల్లా కుప్పంలో వైసీపీకి మరో షాక్ తగిలింది. కుప్పం మున్సిపల్ చైర్మన్ డాక్టర్ సుధీర్ వైసీపీకి రాజీనామా చేశారు. వైసీపీ పార్టీ సభ్యత్వంతో పాటు మున్సిపల్ చైర్మన్, కౌన్సిలర్ పదవులకు రాజీనామా చేసినట్లు ఆయన తెలిపారు. అనంతరం అమరావతిలో సీఎం చంద్రబాబు సమక్షంలో డాక్టర్ సుధీర్ టీడీపీలో చేరారు. సీఎం చంద్రబాబు పసుపు కండువా కప్పి ఆయనను పార్టీలోకి ఆహ్వానించారు.